యాప్నగరం

ఏపీ: ఆర్టీసీ డ్రైవర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

ఆర్టీసీ డ్రైవర్లకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్. డ్రైవర్లకు 8 గంటలకుపైగా విధులు లేకుండా చర్యలు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన అధికారులు.. పలు కీలక నిర్ణయాలు.

Samayam Telugu 10 Jan 2020, 7:54 am
ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్లకు జగన్ సర్కార్ మరో శుభవార్త అందించింది. ఇకపై వారికి 8గంటలకుపైగా విధులు లేకుండా చర్యలు ప్రారంభించింది. డ్రైవర్లకు సరైన విశ్రాంతి లేకుండా బస్సులు నడపటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన అధికారులు.. డ్రైవర్లు అదనంగా విధులు నిర్వహిస్తామని అంగీకరిస్తేనే అనునమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Samayam Telugu rtc


రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సులు వెళుతున్నాయి. ఈ డ్యూటీలతో డ్రైవర్లు ఎక్కువ సమయం విధుల్లో ఉంటున్నారు. దీంతో జిల్లా కేంద్రాలతోపాటూ ముఖ్యమైన నగరాల వరకే బస్సులు నడపాలని భావిస్తున్నారు. అలాగే కండక్టర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకు్నారు. ఎవరైనా కండక్టర్లలో ఉన్నత విద్యావంతులు ఉంటే డిప్యటేషన్‌పై ఇతర శాఖల్లోకి వెళ్లొచ్చు. అలాగే కార్మిక సంఘాలను ఉద్యోగ సంఘాలుగా మార్చుకోవాలని కోరారు.

ఇటు సంక్రాంతికి కూడా ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఈ ఏడాది 4వేలకుపైగా బస్సుల్ని నడుపుతున్నారు. డ్రైవర్ల కొరత ఉంటే బయట నుంచి తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఈ స్పెషల్ సర్వీసుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ బస్సుల తిరుగు ప్రయాణంలో మాత్రం సాధారణ ఛార్జీ కంటే 40శాతం తగ్గించారు. హైదరాబాద్‌కు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.