యాప్నగరం

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి, మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ

అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రిటైల్‌ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి.

Samayam Telugu 22 Oct 2020, 6:49 am
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మార్కెట్‌లో ఉల్లి రేట్లు ఆకాశాన్ని తాకడంతో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లలో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయించనున్నారు. అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రిటైల్‌ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Samayam Telugu సబ్సిడీ ఉల్లి


రాష్ట్రంలో కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్‌సేల్‌ మార్కెట్లలో ఉల్లిపాయలు కొనుగోలు చేయనుంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లలో ఎంతకు కొనుగోలు చేసినా రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. రెండోదశలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న అన్నారు. శుక్రవారం నుంచి రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు విక్రయించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.