యాప్నగరం

AP Lockdown : ఏపీలో ఆంక్షల పొడిగింపు.? కర్ఫ్యూ వేళల్లో మార్పులు.!

ఏపీలో కర్ఫ్యూని పొడిగిస్తారా? లేక ఎత్తేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 31న కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జరిగే సమీక్షలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Samayam Telugu 29 May 2021, 5:57 pm

ప్రధానాంశాలు:

  • ఏపీలో అమల్లో కర్ఫ్యూ
  • ఉదయం 6 నుంచి 10 వరకూ మాత్రమే అనుమతి
  • జూన్ 1 నుంచి ఆంక్షల అమలుపై సస్పెన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
lockdown
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ ఈ నెల 31తో ముగియునుంది. వచ్చే నెల 1 నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంటుందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. రోజుకి పది వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా 17 శాతంగా ఉంది.
కరోనా కేసులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూ మరికొద్ది రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం రెండు వారాలైనా కర్ఫ్యూ పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 31న సీఎం వైఎస్ జగన్ కరోనా కట్టడిపై సమీక్షించనున్నారు. ఆ రోజే ఆంక్షల సడలింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 15 వరకూ కర్ఫ్యూ పొడిగించే అవకాశముందని.. అయితే కొన్ని సడలింపులు కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ ఆంక్షలు అమలవుతున్నాయి. ఆంక్షల వేళల్లో మార్పులు ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.