యాప్నగరం

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 7 వేల మంది

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు.

Samayam Telugu 17 Mar 2020, 6:23 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ (కోవిడ్‌ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. కరోనా వైరస్‌ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.
Samayam Telugu jawahar reddy


ఇప్పటి వరకు రాష్ట్రానికి విదేశాల నుంచి 7 వేల మంది తెలుగు వారు వచ్చారని జవహర్‌రెడ్డి వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లలో ఉండాలని చెప్పామని, వారి కోసం హోమ్‌ ఐసోలేటెడ్‌ చర్యలు చేపట్లినట్లు వివరించారు. ఇటలీ, స్పెయిన్‌, ఇరాక్‌, సౌత్‌ కొరియా, జపాన్‌ దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల కోసం గ్రామ స్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నామని జవహర్‌రెడ్డి తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, పీహెచ్‌సీ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులు క్వారెంటైన్‌ ఫెసిలీటీస్‌లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తెలిసిన తర్వాతే ఇళ్లకు పంపుతున్నట్లు చెప్పారు. ఎరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే 104కు కాల్‌ చేయాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.