యాప్నగరం

చీరాలలో కరణం వర్సెస్ ఆమంచి.. టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు హైకోర్టు నోటీసులు. బలరాం ఎన్నిక చెల్లదంటూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్.

Samayam Telugu 14 Sep 2019, 11:06 am
టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చీరాల నుంచి బలరాం ఎన్నిక చెల్లదంటూ ఆయన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం నోటీసులిచ్చింది. బలరాం ఎన్నికల అఫిడవిట్‌లో అనేక వాస్తవాలు దాచిపెట్టారని, ఈ విషయం అప్పటి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమంచి పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల చీరాల నుంచి బలరాం ఎన్నిక చెల్లదని, తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు.
Samayam Telugu pjimage (53)


Must Read : చంద్రబాబుకు భారీ షాక్.. టీడీపీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఆమంచి పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. బలరాం తన నామినేషన్‌లో భార్య పేరు కరణం సరస్వతిగా పేర్కొన్నారని, ఆయన మరో భార్య ప్రసూన, కుమార్తెల విషయం ప్రస్తావించలేదని ఆమంచి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం ఎమ్మెల్యే కరణం బలరాంకు నోటీసులు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులిచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Also Read :100 రోజుల డెడ్‌లైన్, టార్గెట్ జగన్.. పవన్ ఫస్ట్ పంచ్

గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు పలువురు కోర్టులను ఆశ్రయించారు. చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి, గుంటూరు ఎంపీ అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.