యాప్నగరం

ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.. కానీ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎస్‌ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద దుమారమే రేగింది.

Samayam Telugu 9 Oct 2020, 12:34 pm
పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది.. అదే మాటను ఏపీ ఎన్నికల కమిషనర్ చెప్పాలని కోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు ఎన్నికల సంఘం తరపున ఎరూ హాజరుకాకపోవడంతో నోటీసులు జారీ చేసింది.. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని కోర్టు ప్రస్తావించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని ప్రశ్నించింది.. తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది.
Samayam Telugu ఏపీ హైకోర్టు


మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.. కానీ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎస్‌ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద దుమారమే రేగింది. నిమ్మగడ్డ తొలగింపు ఎన్నో మలుపులు తిరిగింది. మళ్లీ ఇప్పుడు హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై విచారణ జరిగింది. హైకోర్టు నోటీసులుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.