యాప్నగరం

ఆ రెండు నియోజకవర్గాల్లో పంచాయతీ ఏకగ్రీవాలపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు

పిటిషనర్‌ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని చెప్పడంలో సందేహం లేదని జస్టిస్ సోమయాజులు అన్నారు. అధికారులు విధి నిర్వహణలో ఎస్‌ఈసీకి సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామన్నారు.

Samayam Telugu 13 Feb 2021, 6:57 am

ప్రధానాంశాలు:

  • ఏపీ హైకోర్టులో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై పిటిషన్లు
  • పుంగనూరు, తంబళ్లపల్లి, మాచర్ల నియోజకవర్గాల వ్యవహారం
  • ఏపీ హైకోర్టు కీలక సూచనలు, చర్యలు తీసుకోవాలని ఆదేశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లో పంచాయతీ ఏకగ్రీవాలపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల అక్రమాలపై స్పందించాలని.. అన్ని అధికారాలను వినియోగించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ‌ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టించడం.. బలవంతపు ఉపసంహరణపై ఫోకస్ పెట్టాలని సూచించింది. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని.. పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలు ఒకవేళ నిజమైతే అవి తీవ్రమైనవని వ్యాఖ్యానించింది.
చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె.. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు, అక్రమాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ లాయర్ వీరారెడ్డి వాదనలు వినిపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్లు వేయనీయకుండా అధికార పార్టీ శ్రేణులు అడ్డుకుంటున్నాయన్నారు. అతికష్టం మీద నామినేషన్‌ వేసినా.. తర్వాత ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తున్నారన్నారు. ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.

ఎస్ఈసీని అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాము అన్నారు ఎస్‌ఈసీ తరఫు లాయర్ అశ్వనీకుమార్‌. అధికారులు విఫలమైనట్లు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని.. నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కోర్టుకు రావాలే తప్ప.. వారందరి తరఫున పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపించారు

పిటిషనర్‌ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని చెప్పడంలో సందేహం లేదని జస్టిస్ సోమయాజులు అన్నారు. ఈ దశలో న్యాయస్థానం లోతైన అంశాల్లోకి వెళ్లడం లేదని.. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పోటీ చేయడం.. భయాందోళన, బెదిరింపులకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోగలిగే ఎన్నికలు నిర్వహించాలన్నారు. పిటిషన్‌లలో వాస్తవాలు, ఆరోపణలపై కోర్టు మాట్లాడటం లేదని.. అధికారులు విధి నిర్వహణలో ఎస్‌ఈసీకి సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయడానికి తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.