యాప్నగరం

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు

Uttarandhra Graduate Mlc Counting కు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఎన్నిక ఫలితాలు కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందని తెలిపింది. నాలుగు వారాలకు విచారణను వాయిదా వేసింది. ఎన్నికల పోలింగ్ రోజు హైకోర్టుకు సెలవు ఇచ్చి.. దిగువ కోర్టులకు సెలవు ఇవ్వకపోవడంపై విశాఖకు చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఓటు వేయలేకపోయినవారికి.. ఓటు వేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 16 Mar 2023, 6:59 am

ప్రధానాంశాలు:

  • ఉత్తరాంధ్ర గ్యాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఫలితం
  • హైకోర్టును ఆశ్రయించిన విశాఖకు చెందిన వ్యక్తి
  • మరోసారి ఓటుకు అవకాశం ఇవ్వాలని కోరారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AP High Court
ఏపీ హైకోర్టు ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ జరిగిన రోజు హైకోర్టు సెలవు ప్రకటించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కోర్టులకు సెలవు ఇవ్వలేదని విశాఖకు చెందిన న్యాయవాది కోడి శ్రీనివాసరావు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు ఎన్నిక నిర్వహించాలని కోర్టును కోరారు.
హైకోర్టు న్యాయవాదులకు సెలవు ఇచ్చి.. మిగిలిన కోర్టు న్యాయవాదులకు సెలవు ఇవ్వకపోవడం వివక్ష చూపడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం కోర్టు ఇచ్చే తుది తీర్పుకి లోబడి ఉంటుందని తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఫలితాల వెల్లడిని నిలువరిస్తూ ఉత్తర్వులివ్వలేదని తెలిపింది.

నేడు జరిగే కౌంటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.. కాకపోతే కోర్టు ఎన్నికల ఫలితం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం చెబుతోంది. దీంతో ఉత్తరాంధ్ర గ్యాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం ఫలితంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని అందరిలో ఉత్కంఠ మొదలైంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.