యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్సీపై రాష్ట్రపతి గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రవీంద్రబాబును అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Samayam Telugu 13 Aug 2020, 12:38 pm
ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు అందింది. వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై మెయిల్ ద్వారా రాష్ట్రపతి, గవర్నర్‌కు.. ఫిర్యాదు చేశారు న్యాయవాది లక్ష్మీనారాయణ. కోర్టును, లాయర్లను ఉద్దేశించి రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరుగా ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ అనుమతిని లాయర్ లక్ష్మీనారాయణ కోరారు. రవీంద్రబాబును ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Samayam Telugu వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు
ysrcp mlc padula ravindra babu


ఇటీవల కుట్రపూరితంగా కోర్టులను విమర్శిస్తున్నారని.. కోర్టుల ప్రతిష్ట దెబ్బతీసే లక్ష్యంతో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ఎవరో తేల్చాలన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టు సీజేకు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే లాయర్ లక్ష్మీనారాయణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాశారు. కోర్టును, న్యాయమూర్తులను ఉద్దేశించి రవీంద్రబాబు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని న్యాయవాది లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు ఇలా మాట్లాడటం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు.
Read More: ఏపీలో కరోనా హెల్ప్‌లైన్ ఏర్పాటు
ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సందర్భంగా పండుల రవీంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన జడ్జిల మీద కొన్ని పరుష వ్యాఖ్యలు చేసినట్టు ప్రముఖ వెబ్ సైట్ రిపోర్ట్ చేసింది. ‘జ్యుడీషియరీగానీ, చంద్రబాబుగానీ, జడ్జీలుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు’ అని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పరుష వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. దీంతో పాటు రాజధాని రైతుల శాపమే చంద్రబాబును ఘోర పరాజయంపాలు చేసిందని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.