యాప్నగరం

ఏపీ విద్యార్థులకు శుభవార్త: అమ్మఒడి, విద్యాదీవెన డబ్బులు, కిట్లు.. అన్నింటిపై క్లారిటీ!

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుభవార్త చెప్పారు.

Samayam Telugu 5 Jan 2022, 5:22 pm
ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుభవార్త చెప్పారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక కిట్లు.. ఇతన పథకాలు అన్నింటిపై మంత్రి సురేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేయాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు.
Samayam Telugu మంత్రి ఆదిమూలపు సురేష్


ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ఏజెన్సీలకు వర్క్‌ ఆర్డర్లు జారీ చేయాలని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో మంత్రి సరేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లోనే విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన పథకాలకు అర్హుల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సురేష్ సూచించారు. నాడు- నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకొస్తున్న ఫౌండేషన్‌ స్కూళ్ల అమలుకు ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల మ్యాపింగ్, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల భర్తీపై చర్చించారు. పాఠశాలల్లో సకాలంలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.