యాప్నగరం

‘మాజీ సీఎంగా బాబు అక్కడ ఉండొచ్చా.. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ రాజకీయాలను మరింత వేడిక్కిస్తున్నారు.

Samayam Telugu 23 Sep 2019, 12:42 pm
కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీచేసిన సీఆర్డీఏ అధికారులు.. తాజాగా వాటి కూల్చివేత పనులు సోమవారం ప్రారంభించారు. కరకట్టపై ఉన్న పాతూరి కోటేశ్వరరావు గెస్ట్‌హౌస్ వద్ద నిర్మించిన ర్యాంపును తొలగిస్తున్నారు. అయితే, ఇది అక్రమ నిర్మాణం కాదని, తన అర ఎకరం పొలం నదిలో కలిసిపోయిందని, దీనికి సంబంధించిన పత్రాలను అధికారులకు చూపించానని పాతూరి కోటేశ్వరరావు అంటున్నారు. ప్రవహం వల్ల పొలం దెబ్బతినకుండా ర్యాంప్ నిర్మించినట్టు కోటేశ్వరరావు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌, అక్రమ కట్టడాల కూల్చివేతలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu Satyanarayana


Read Also: జగన్‌కు ఫోన్‌‌చేసి ఎజెండా ఖరారు చేసిన కేసీఆర్.. నేడు కీలక చర్చలు!
ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేవలం చంద్రబాబు నివాసమే కాకుండా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చి వేస్తామని పేర్కొన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో నివాసం ఉండొచ్చా? ఆయన ప్రజలకు బాబు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని బొత్స మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కరకట్ట వరకు వచ్చి ఎందుకు ఆగిందని ప్రశ్నించారు. కరకట్టపై నిర్మాణాలు సక్రమమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు కదా అని చెప్పారు.

Read Also: కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ.. బాబు నివాసం?

చంద్రబాబు నివాసాన్ని కూల్చివేస్తున్నామనేది అవాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు నాలుగు రోజుల కిందట జారీచేసినవే చివరి ఆదేశాలని ఆయన స్పష్టం చేశారు. అయితే వారం తర్వాత ఏం చేయాలనేది అధికారులే చూసుకుంటారన్న బొత్స.. చంద్రబాబు ఇల్లు కూల్చివేస్తున్నారని జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. లబ్ది పొందడానికి ప్రతిపక్ష నేత ఇంటిని కూల్చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.