యాప్నగరం

జగన్-చిరు భేటీ.. బాలయ్యను ప్రస్తావిస్తూ బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

YS Jagan| ఈ నెల 14న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి సమావేశం. ఈ భేటీపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇద్దరి భేటీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు.

Samayam Telugu 11 Oct 2019, 9:25 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్-మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 14న భేటీకానున్నారు. జగన్ బిజీ షెడ్యూల్‌తో ఈ సమావేశం వాయిదాపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం-చిరు భేటీపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి సమావేశాన్ని ఖాయం చేస్తూనే.. తెలుగు ఇండస్ట్రీ గురించి, నందమూరి బాలయ్య గురించి ప్రస్తావించారు. చిరంజీవి జగన్‌ను కలవాలనుకున్నారని.. ముఖ్యమంత్రి కూడా రమ్మని పిలిచారన్నారు బొత్స. సినిమా కారణంతోనే సీఎంను కలవబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రాజకీయ కారణాలు ఏవీ లేవన్నారు.
Samayam Telugu satya


Read Also:14న జగన్‌తో మెగాస్టార్ భేటీ .. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పేరుతో పోస్ట్ వైరల్

ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి జగన్‌ను కలవడంలో విచిత్రం ఏముందని.. ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది వచ్చి కలుస్తుంటారని చెప్పుకొచ్చారు. గతంలో నాగార్జున, మోహన్‌బాబుతో పాటూ చాలామంది వచ్చి జగన్‌ను కలిశారని గుర్తు చేశారు. అంటే ప్రత్యేకంగా బాలయ్య వచ్చి కలవాలా అంటూ ప్రశ్నించారు బొత్స. సినిమా ఇండస్ట్రీ అంటే బాలయ్య ఒక్కరేనా.. అసోసియేషన్ మొత్తం వచ్చి కలవాలా.. అవసరమైతే వచ్చి వాళ్లు కలుస్తారన్నారు బొత్స.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ షెడ్యూల్ మారింది. వాస్తవానికి శుక్రవారం (11) సమావేశం జరగాల్సి ఉన్నా.. సీఎం బిజీగా ఉండటంతో మరో మూడు రోజులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఈ భేటీ వాయిదా పడిందట. ఈలోపే ఆ ఢిల్లీ పర్యటను కూడా వాయిదా పడింది. అందుకే ఈ నెల 14న చిరంజీవి జగన్‌ను కలవనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.