యాప్నగరం

తిరుపతి ఎన్నికలు జరిగితే బైబిల్ కావాలో భగవద్గీత కావాలో తెలుస్తుంది: బొత్స

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన బైబిల్ పార్టీ వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు.

Samayam Telugu 5 Jan 2021, 3:00 pm
బైబిల్ పార్టీ కావాలో.. భవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండంటూ.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి ఎన్నికలు జరిగితే.. బైబిల్ కావాలో భగవద్గీత కావాలో తెలుస్తుందన్న బొత్స.. రేపు వచ్చి తిరుపతిలో ఇవే మాటలు చెప్పాలని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.
Samayam Telugu Botsa
Andhra Pradesh Municipal and Urban Development minister Botsa Satyanarayana (File Photo)


జగన్‌కు వాటికన్ సిటీ అంటే ఆనందం.. అమరావతి అంటే కంపరమని వ్యాఖ్యానించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుణ్ని బొత్స టార్గెట్ చేశారు. వాటికన్ సిటీకి అమరావతికి సంబంధం ఏంటని మంత్రి ప్రశ్నించారు. అమరావతి అనేది చంద్రబాబు దోపిడీగా బొత్స అభివర్ణించారు. అసలు అమరావతి మరో 40 కిలో మీటర్ల దూరంలో ఉందన్న బొత్స.. అమరేశ్వరుని భూములు దోచుకొన్నది బాబు కాదా అని ప్రశ్నించారు.

మతాల మధ్య గొడవ పెట్టడానికి చంద్రబాబు దగుల్బాజీ రాజకీయం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. బాబు పవిత్రమైన హిందువు అయితే విజయవాడలో హిందూ దేవాలయాలను కూల్చాడని ప్రశ్నించారు. అప్పుడు హిందు, క్రిస్టియన్, ముస్లిం అని గుర్తు రాలేదా అని నిలదీశారు.

రామతీర్థం సంఘటన జరిగిన వెంటనే మేం స్పందించామన్న బొత్స.. సాక్షాత్తూ ఆ దేవాలయం ఛైర్మన్ అశోక్ గజపతి రాజే అక్కడికి వెళ్లలేదన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వ్యక్తి కాదంటూ మండిపడ్డారు. ఆయన దేనికైనా తెగించిన వ్యక్తి అని.. రామతీర్థం విచారణ తేలితే అసలు రంగు బయటపడుతుందని బొత్స వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.