యాప్నగరం

ఇప్పటి వరకు ఏపీలో ఇలాంటి సంస్కృతి లేదు నారా లోకేష్ నాలుక చీరేస్తాం: మంత్రి రాజా

Dadisetti Raja నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన కుమారుడ్ని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. టీడీపీకి విష ప్రచారం చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Sep 2022, 7:50 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Dadisetti Raja
రాష్ట్రంలో మహిళలంతా ఎవరి ఇంట్లో వారు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) కోరుకుంటున్నారన్నారు మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetti Raja). అలాంటిది సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిపై నారా లోకేష్ (Nara Lokesh) ఆధ్వర్యంలో ఐటీడీపీ టీమ్ అవాకులు, చెవాకులు మాట్లాడుతోందని మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో రకరకాల తప్పుడు పోస్టులు పెడుతున్నారని.. వారి తాబేదార్లయిన అనుకూల మీడియాలో రోజూ కథనాలు వండి వారుస్తున్నారన్నారు. టీడీపీకి విషప్రచారం చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరవంగా ఇంట్లో ఉండే మహిళలను రోడ్డుకు ఈడిస్తే లోకేష్ నాలుక చీరేస్తామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలోని మహిళలందరూ సీఎం జగన్‌ను అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా భావిస్తున్నారని చెప్పారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లను రోడ్డుమీదకు లాగి రాజకీయం చేసే సంస్కృతి ఏపీలో ఇప్పటివరకు లేదన్నారు. ఇటువంటి పద్ధతిని రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టొద్దని చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు ఇంట్లో కూడా మహిళలున్నారని.. కావాలనుకుంటే వారిమీద తాము కూడా అవాకులు, చెవాకులు మాట్లాడగలమన్నారు.

తాము కూడా తప్పుడు ప్రచారం చేయగలమని, కానీ.. అది తమ సంస్కృతి కాదన్నారు మంత్రి రాజా. చంద్రబాబు తన కుమారుడికి సభ్యత, సంస్కారం నేర్పించి అదుపులో ఉంచుకోవాలన్నారు. సీఎం సతీమణి వైఎస్‌ భారతమ్మ మీదే కాకుండా రాష్ట్రంలో ఏ అక్కచెల్లెమ్మల జోలికి వస్తే నారా లోకేష్ నాలుక చీరేస్తామని మంత్రి హెచ్చరించారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.