యాప్నగరం

వైసీపీ ఎంపీ రఘురామపై పోలీసులకు మంత్రి ఫిర్యాదు

వైసీసీ ఎంపీ తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఆరోపణలు చేశారు. పందులే గుంపులుగా వస్తాయంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని కూడా మంత్రి తప్పు పట్టారు.

Samayam Telugu 8 Jul 2020, 1:27 pm
ఏపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఢిల్లీలో ఫిర్యాదుల ఎపిసోడ్ తర్వాత తాజాగా వైసీపీ రెబల్ ఎంపీపై గృహనిర్మాణశాఖా మంత్రి శ్రీరంగనాథ రాజు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం మంత్రి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఫిర్యాదులో మంత్రి పేర్కొన్నారు. "రాజకీయ,ప్రజా జీవితంలో విమర్శలు సహజం, కానీ ఒక అవకాశవాది తన వ్యక్తిగత, స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటి వారి వ్యక్తిత్వంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదలుచుకోలేదని మంత్రి తెలిపారు. తనను తన కుమారుని వ్యక్తిగతంగా దూషించి దొంగలు అని సంబోధించడం పై మనస్థాపం చెందానని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu వైసీపీ ఎంపీ రఘురామ
ysrcp mp raghu rama


తన తోటి ఎమ్మెల్యేలు, మరో మంత్రి పేర్ని నాని తో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానిని ఉదహరిస్తూ "పందులే గుంపులుగా వస్తాయి" అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించటంపై రంగనాధ రాజు ఆక్షేపించారు. రామకృష్ణంరాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలను, నిరాధారమైన ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని సంవత్సరాలు నిజాయితీ పరుడిగా, సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో నేను సంపాదించుకున్న మంచి పేరు పై బురద చల్లుతున్నారని ఆయన పేర్కొన్నారు.

అంతే కాకుండా తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా, తన వ్యక్తిత్వాన్నీ దెబ్బ తీసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహరించటం దారుణమని మంత్రి రాఘనాథ రాజు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా.. చట్టాలను గౌరవించే వ్యక్తిగా.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో.. న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.