యాప్నగరం

TDP: 'మా నాన్న చంద్రబాబుది గొప్ప విజనరీ కదా ఆయన్ని చూసి'.. లోకేష్‌‌కు మంత్రి రోజా కౌంటర్

Nara Lokesh ట్వీట్‌కు Minister Roja కౌంటర్ ఇచ్చారు. మద్యపాన నిషేధం లోకేష్ చేసిన ట్వీట్‌కు ఏపీ మంత్రి ఘాటుగా స్పందించారు. ఇంటింటికి మినరల్ వాటర్ ఇస్తామని క్వార్టర్ బాటిల్ ఇచ్చాము అంటూ విరుచుకుపడ్డారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 3 Oct 2022, 5:31 am

ప్రధానాంశాలు:

  • నారా లోకేష్ వర్సెస్ మంత్రి రోజా
  • ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది
  • మద్యపాన నిషేధంపై రోజా కౌంటర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Minister Roja
టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh), ఏపీ మంత్రి రోజా (Minister Roja)ల మధ్య ట్విట్టర్‌లో వార్ నడుస్తోంది. కొద్దిరోజులుగా నారా లోకేష్ చేస్తున్న ట్వీట్‌లకు రోజా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మద్యపాన నిషేధంపై నారా లోకేష్ చేసిన ట్వీట్‌కు రోజా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘జనం: మద్యపాన నిషేధం అన్నారు. జగన్: అప్పట్లో ఉన్న బ్రాండ్స్ అన్నీ బ్యాన్ చేసి జే-బ్రాండ్స్ తెచ్చా కదా!’అంటూ జగన్ సర్కార్ టార్గెట్‌గా లోకేష్ ట్వీట్ చేశారు.
నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్‌కు మంత్రి రోజా (Minister Roja) కౌంటర్ ఇచ్చారు. జనం: జగనన్న బెల్టు షాపులు రద్దు చేసి,33% మద్యం షాపులు తగ్గిస్తే వినియోగం తగ్గింది, ఒక్క కొత్త డిస్టీలరీకి అనుమతివ్వలేదు. #JaganMarkGovernance అంటూ హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేశారు. లోకేష్‌కు కౌంటర్‌గా.. లోకేష్: ఎన్టీఆర్ తెచ్చిన మద్యపాన నిషేధం ఎత్తేశాం, ఆయన విధానాలను చంపేశాం, మా నాన్న చంద్రబాబు ది గొప్ప విజనరీ కదా ఆయన్ని చూసి వచ్చిన 14 మద్యం డిస్టీలరీలకు అనుమతిచ్చాం. మన పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవైరెడ్లకు కొత్త డిస్టీలరీలు ఇచ్చి మద్యం ఉద్యమాన్ని ప్రోత్సహించాం. ఇంటింటికి మినరల్ వాటర్ ఇస్తామని క్వార్టర్ బాటిల్ ఇచ్చాము అసలే మా బాబు దేమో #vision420 కదా..!!’అంటూ రోజా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు లోకేష్ గతంలో చేసిన ట్వీట్‌లకు మంత్రి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.