యాప్నగరం

ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ.. టీడీపీ నేత అరెస్ట్

ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ చేసిన ఘనుడు.. అసైన్డ్ భూమిని కేటాయించాలంటూ ఫోర్జరీ సంతకంతో మంత్రి పేరు మీద కలెక్టర్‌కు లేఖ. హోంమంత్రి, డీజీపీలకు ఫిర్యాుద చేసిన మంత్రి.

Samayam Telugu 13 Feb 2020, 11:10 am
ఏపీ మంత్రి తానేనటి వనిత సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలంరేపింది. ఏకంగా మంత్రి లెటర్ హెడ్‌తో పాటూ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి వనిత సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఈ వ్యవహారంపై హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. తన లెట్ హెడ్‌ను, సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డప్పపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడం ఏపీ అధికార వర్గాల్లో సంచలనంగా మారింది.
Samayam Telugu vanitha


కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి లెటర్ హెడ్, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఆ లెటర్ హెడ్‌పై మంత్రి వనిత పేరుతో కడప జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు లేఖ రాసినట్లు గుర్తించారు. రెడ్డప్పకు అసైన్డ్ భూమి కేటాయించాలని కలెక్టర్‌‌ను ఆ లేఖలో కోరినట్లు మాయ చేశాడు. కానీ మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడంతో రెడ్డప్ప అడ్డంగా దొరికిపోగా.. అతడు టీడీపీ నేతని తెలుస్తోంది. మంత్రి తానేటి వనిత నేరుగా హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేయడంతో సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. రెడ్డప్పను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.