యాప్నగరం

TDP ‘క్విట్ జగన్’ నినాదానికి వైఎస్సార్సీపీ కౌంటర్.. తెర మీదకు కొత్త నినాదం!

TDP క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ స్లోగన్‌కు కౌంటర్‌గా వైఎస్సార్సీపీ సరికొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. జగనే కావాలి.. జగనే రావాలంటూ మంత్రి సీదిరి అప్పలరాజు నినదించారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 28 May 2022, 8:34 pm

ప్రధానాంశాలు:

  • క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినదించిన చంద్రబాబు
  • దీటుగా మరో నినాదం తీసుకొచ్చిన వైఎస్సార్సీపీ
  • మంత్రి సీదిరి అప్పలరాజు కొత్త నినాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu jagan babu
YS Jagan - Chandrababu Naidu
TDP Slogan | రావాలి జగన్.. కావాలి జగన్ నినాదంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు మూడేళ్లు పూర్తి చేసుకుంటుండగా.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావిస్తోన్న టీడీపీ.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. టీడీపీ నిర్వహించిన మహానాడు (TDP Mahanadu) కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఈ నినాదాన్ని పదే పదే ప్రస్తావించారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ ‘బై బై బాబు’ నినాదం తరహాలో.. టీడీపీ క్విట్ జగన్ అని నినదిస్తోంది.
కాగా ప్రతిపక్షం నినాదానికి పోటీగా వైఎస్సార్సీపీ నూతన నినాదాన్ని తెర మీదకు తెచ్చింది. నరసరావుపేటలో నిర్వహించిన మంత్రుల సభలో మంత్రి సీదిరి అప్పల రాజు (Seediri Appalaraju) ‘జగనే రావాలి.. జగనే కావాలి’ (Jagane Ravali Jagane Kavali) అనే నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. రావాలి జగన్.. కావాలి జగన్‌ను కాస్త మార్చి ఆయన ఈ నినాదం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ ఇవే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

నరసరావుపేటలో వైఎస్సార్సీపీ మంత్రులు నిర్వహించిన సామాజిక న్యాయ భేరీ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ వేదికపై నుంచి మంత్రులు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టీడీపీ వ్యతిరేకమని మంత్రులు ఆరోపించారు. టీడీపీ, జనసేనపైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సర్కారు దామాషా ప్రకారం ప్రజలకు న్యాయం చేస్తోందన్నారు. విపక్షాలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలా వద్దా అని ప్రశ్నించారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.