యాప్నగరం

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దు

విద్యార్థుల అకడమిక్ ఇయర్ క్యాలెండర్, సిలబస్ విషయంలో కన్ఫ్యూజ్ కావొద్దని సూచించారు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌ రెడ్డి . ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు.

Samayam Telugu 25 Aug 2020, 7:06 am
ఏపీ విద్యార్థులకు ముఖ్యమైన గమనిక.. అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు అధికారులు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటించలేదని ఏపీ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌ రెడ్డి అన్నారు. క్యాలెండర్‌పై జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అకడమిక్ ఇయర్ క్యాలెండర్ నకిలీదని.. విద్యార్థులు గందరగోళానికి గురికావొద్దని సూచించారు. ఏదైనా క్యాలెండర్ విడుదల చేస్తే విద్యార్థులకు తాము తెలియజేస్తామంటున్నారు.
Samayam Telugu విద్యార్థులు (Photo Credit-TOI)


ఇక సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచే నాటికి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. సిలబస్ తగ్గిస్తారు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టి పారేశారు. సిలబస్‌ అలాగే ఉంటుందని.. కేవలం కొన్ని మార్పులతో, త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని ప్రతాప్‌ రెడ్డి అన్నారు. విద్యార్థుల అకడమిక్ ఇయర్ క్యాలెండర్, సిలబస్ విషయంలో కన్ఫ్యూజ్ కావొద్దని సూచించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.