యాప్నగరం

40 ఏళ్ల ఇండస్ట్రీలో.. చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం సంచలన వ్యాఖ్యలు

పొలిటికల్ మైలేజ్‌ కోసం పోలీస్‌ వృత్తిపై నిరాధార ఆరోపణలు సిగ్గుచేటని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న పోలీసులపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

Samayam Telugu 7 Jan 2021, 5:35 pm
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'రాజకీయ స్వలాభాల కోసం పోలీసులకు మతాలను ఆపాదించొద్దని.. కుల, మత అనే భేదం లేకుండా ప్రజల కోసం సేవచేస్తున్నామన్నారు. పొలిటికల్ మైలేజ్‌ కోసం పోలీస్‌ వృత్తిపై నిరాధార ఆరోపణలు సిగ్గుచేటని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. ఇక్కడ (ఏపీలో) పనిచేస్తున్న పోలీసులపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఆ నాయకుడు ఏం నేర్చుకున్నారని.. ఇలాంటి వ్యాఖ్యల వలన పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. పోలీస్‌శాఖలో ఎవరికి కుల, మత భేదాలు లేవన్నారు.
Samayam Telugu సీఎం జగన్


ఇటీవల చంద్రబాబు పోలీసు అధికారుల తీరుపై మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసంతో పాటూ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఏకంగా డీజీపీని టార్గెట్ చేశారు. అంతేకాదు మతపరమైన అంశాలను ప్రస్తావించారు. దీంతో పోలీస్ అధికారుల సంఘం స్పందించింది. చంద్రబాబు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.