యాప్నగరం

కరోనాపై పోరు: ఏపీ సర్కారు కీలక చర్యలు.. రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే

కరోనా వైరస్‌ను అదుపు చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న ఏపీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Samayam Telugu 24 Mar 2020, 9:16 am
కరోనా వైరస్ కట్టడి కోసం ఏపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఏడు కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో.. జగన్ సర్కారు అప్రమత్తమైంది. ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించగా.. ప్రజలు మాత్రం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో నిబంధనలను ఉల్లంఘిస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమయ్యే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు కచ్చితంగా ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Samayam Telugu ys jagan amaravati


అంటు వ్యాధుల నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని డీజీపీ ఆఫీసు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తామని.. నెల రోజుల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని డీజీపీ ఆఫీసు తెలిపింది. ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై సెక్షన్ 269 ప్రకారం కేసు నమోదు చేస్తే.. ఆరు నెలల వరకు జైలు శిక్షకు అర్హులని హెచ్చరించింది.

ఉద్దేశపూర్వకంగా ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేసే వారిపై ఐపీసీ సెక్షన్ 270 కింది కేసు పెడతామని.. రెండేళ్లపాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని డీజీపీ ఆఫీసు తెలిపింది. క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిని వారిపై ఐపీసీ సెక్షన్ 271 కింద కేసు నమోదు చేస్తామని.. ఆరు నెలల వరకు జైలు శిక్షకు అర్హులు అర్హులని తెలిపింది.

కరోనా కట్టడి కోసం ఏపీ సర్కారు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయం తీసుకోవాలని భావిస్తోంది. మిగతా రాష్ట్రాలకు లేని విధంగా ఏపీలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లు ఉన్నారు. కరోనా విషయమై ప్రజలకు అవగాహన కలిగించడంతోపాటు.. అనుమానితుల గురించి సమాచారం తెలుసుకోవడంలో వీరి సేవలు కీలమయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.