యాప్నగరం

జగన్ సర్కార్ లేఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్ట్రాంగ్ కౌంటర్

సీఎస్ సాహ్నీ రాసిన లేఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ఘాటుగా ఓ మెసేజ్ పంపారు. సమావేశానికి రావడం కుదరదని సీఎస్ చెప్పడంతో ఘాటుగా..

Samayam Telugu 18 Nov 2020, 8:48 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివాదం రేగుతోంది. జగన్ సర్కార్-ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య వార్ నడుస్తోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం.. కౌంటర్‌గా సీఎస్ నీలం సాహ్నీ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా సాహ్నీ రాసిన లేఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ఘాటుగా ఓ మెసేజ్ పంపారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని ఎలా ప్రశ్నిస్తారని నిమ్మగడ్డ ప్రశ్నించారు. సీఎస్ రాసిన లేఖ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్


ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని జిల్లాల యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు మంగళవారం రాత్రి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని.. పోలీసులు, జిల్లా యంత్రాంగం కరోనా వ్యప్తి అదుపు చేసే విధుల్లో ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదని.. గ్రామీణ ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నాయి అన్నారు. నేటి జిల్లా యంత్రాంగాలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదన్నారు.. తాను సమావేశానికి రావడం కుదరదు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏపీలో కరోనా ఉధృతి కూడా తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి పడిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, ఎలక్షన్స్‌కు 4 వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత వెలువరిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.