యాప్నగరం

విశాఖ వెళ్లేందుకు అంతా సిద్ధం.. సచివాలయ ఉద్యోగుల కీలక నిర్ణయం

విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

Samayam Telugu 18 Mar 2020, 5:49 pm
విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు సహా ప్రభుత్వ కీలక నేతలు ప్రకటించారు. తాజాగా, విశాఖపట్నం వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. బుధవారం వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు కీలక సమావేశం నిర్వహించారు.
Samayam Telugu pjimage (99)


Also Read: కరోనా ఎఫెక్ట్: ఏపీలో విద్యాసంస్థల బంద్

ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల అవసరాలపై అభిప్రాయ సేకరణ జరపాలని కోరారు. మే 31 లోపు ఉద్యోగులను విశాఖ తీసుకెళ్లాలన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిలో లెజిస్లేచర్, కర్నూలులో జ్యుడీషియల్ రాజధానిని ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో సైతం తీర్మానం చేశారు.

అయితే మూడు రాజధానులకు సంబంధించిన అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. అలాగే దీనికి సంబంధించిన పలు సాంకేతిక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే రాజధాని తరలింపుపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా, సచివాలయ ఉద్యోగులు సైతం తాము విశాఖ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Also Read: ‘అన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ బంద్, ఏపీలో తప్ప.. జగన్ ఇగో వల్లే..’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.