యాప్నగరం

అమెరికాలో గోదావరి జిల్లా వాసి మృతి

అమెరికాలోని నార్త్ కరోలినాలో తెలుగు యువకుడు మృతి చెందాడు. గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే యువకుడి మరణానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మృతదేహాన్ని స్వదేశం పంపేందుకు తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.

Samayam Telugu 1 Nov 2019, 11:03 pm
అమెరికాలో తెలగు యువకుడు హఠాన్మరణం చెందారు. ఏపీకి చెందిన శివ చలపతిరాజు అమెరికాలోని నార్త్ కరోలినాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శివ మంగళవారం చనిపోయినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. శివ భార్య సౌజన్య గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో గ్రీన్ కార్డు బ్లాక్ లాగ్ లిస్టులో ఉండడం.. ఆమె భర్త అకాల మరణం చెందడంతో గర్భిణి అయిన సౌజన్య స్వదేశానికి బయలుదేరారు.
Samayam Telugu siva


రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం చేసిన శివ అనంతరం అమెరికా వెళ్లారు. నార్త్ కరోలినాలో శివ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. అక్కడ పలు కంపెనీల్లో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆయన మరణానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. అయితే ఆయన ఫేస్‌బుక్ ద్వారా ఆయనది గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

Also Read: కులానికి సంకెళ్లు పడ్డట్టున్నాయ్.. ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

శివ మృతి పట్ల అక్కడి తెలుగు సంఘాలు స్పందించాయి. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ తెలుగు అసోసియేషన్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేస్తున్నట్లు సమాచారం. శాశ్వత నివాసం కోసం చేసుకున్న దరఖాస్తు బ్యాక్‌లాగ్‌లో ఉండడంతో పుట్టెడు దుఖంలో ఆయన భార్య ఇండియాకు తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.