యాప్నగరం

ఏపీకి భారీ వర్ష సూచన.. వీళ్లకు తీవ్ర హెచ్చరికలు.. మరో 3 రోజులు పాటు, ఈ జిల్లాల్లో..!

ఏపీకి భారత వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు..!

Samayam Telugu 24 Sep 2021, 9:23 pm
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భాతర వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. శుక్రవారం రాత్రికి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ- వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనించనుంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అలాగే, ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్- ఒడిశా- ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50- 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రజలు సూచించారు.

రాబోయే 3 రోజుల వాతావరణ సమాచారం
శనివారం (25-09-2021)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం.

ఆదివారం (26-09-2021)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

సోమవారం (27-09-2021)శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.