యాప్నగరం

ఏపీలో మూడు రోజులు వర్షాలు.. ఈ ప్రాంత ప్రజలకు అలర్ట్!

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వానలు పడతాయని పేర్కొంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 31 Mar 2023, 1:18 am
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర మధ్య మహారాష్ట్రలోని మధ్య భాగాల నుంచి ఉన్న ద్రోణి కోత ఇప్పుడు ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, మరాఠవాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణాల్లో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


రాబోయే 3 రోజులు వాతావరణ సూచనలివే!
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గురువారం, శుక్రవారం, శనివారంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే, ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవంచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రలో గురువారం, శుక్రవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. శనివారం ఒకట్రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ ప్రాంతంలో గురువారం, శుక్రవారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే, ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవంచే ఛాన్స్ ఉంది. అలాగే, గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక, శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక, ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవంచే అవకాశం ఉంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.