యాప్నగరం

Maha Shivaratri: శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శైవ క్షేత్రాలు మహా శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు.. భక్తులు శైవ క్షేత్రాలకు తరలివెళ్తున్నారు. ఈ సమయంలో.. శివ భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 17 Feb 2023, 6:40 pm

ప్రధానాంశాలు:

  • శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
  • 3,800 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
  • సాధారణ ఛార్జీలే ఉంటాయన్న అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu APS RTC
ఆర్టీసీ బస్సులు
Maha Shivaratri: మహా శివరాత్రి సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు.. ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో అత్యధికంగా కోటప్ప కొండకు 675, శ్రీశైలానికి 650, కడప జిల్లా పొలతలకు 200, పట్టిసీమకు 100 బస్సులు ఏర్పాటు చేసినట్టు APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేశారు. 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.
అటు శైవక్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వివరించారు. ఘాట్‌రోడ్లపై నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సుల నడిపించనున్నట్లు స్పష్టం చేశారు. తూర్పుకనుముల్లోని మహేంద్రగిరి పర్వతాల్లో జరిగే శివరాత్రి మహాయాత్రకు.. పలాస నుంచి సుమారు 25 వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారి శ్రీనివాసరావు చెప్పారు. సాబకోట, సింగుపురం గ్రామాలవద్ద నడకయాత్ర భక్తుల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించనున్నారు. ఉచిత వైద్యశిబిరాలు, 108 వాహనాలను సిద్ధం చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.