యాప్నగరం

ఆ నాలుగు జిల్లాల వాళ్లు జాగ్రత్త.. ప్రజలకు జగన్ సర్కార్ అలర్ట్

రాష్ట్రంలోనే ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆరోగ్య ఆంధ్ర ట్వీట్ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటకు వస్తే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Samayam Telugu 25 Apr 2020, 9:22 am
ఏపీని కరోనా వణికిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి దగ్గరగా వెళుతున్నాయి. గత రెండు రోజులుగా 150కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే పరీక్షల సంఖ్య పెరగడంతో కేసులు కూడా బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌జోన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అక్కడ నిత్యావసరాలు, మందులు వంటివి వాలంటీర్ల సాయంతో ఇళ్లకు పంపిణీ చేస్తున్నారు. పోలీసులు జనాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఉదయం సమయంలో కూడా జనాల్ని బయటకు రానివ్వడం లేదు.
Samayam Telugu ఏపీ ప్రజలకు అలర్ట్


రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శనివారం ఉదయం వరకు కర్నూలు జిల్లాలో 261 కేసులు.. గుంటూరు జిల్లా 206.. కృష్ణా జిల్లాలో 102.. చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేసింది. రాష్ట్రంలోనే ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆరోగ్య ఆంధ్ర ట్వీట్ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటకు వస్తే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.