యాప్నగరం

ఏపీ: కలవరపెడుతున్న గుండెపోట్లు.. ఇద్దరు సీఐల హఠాన్మరణం, నిమిషాల్లోనే ప్రాణాలు పోతున్నాయి!

Atmakur Ci Sudden Death విషాదాన్ని నింపింది. ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావు, విశా సీబీఐ ఇన్స్‌పెక్టర్ శర్మలు ప్రాణాలు కోల్పోయారు. నాగేశ్వరరావు ఇంట్లో భోజనం చేసిన వెంటనే కుప్పకూలిపోయారు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్థారించారు. విశాఖలో ఇన్స్‌పెక్టర్ శర్మ కూడా షటిల్ ఆడుతూ కుప్పకూలాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. వరుస గుండెపోటు మరణాలు అందరినీ కలవరపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చాలామంది హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 21 Mar 2023, 8:47 am

ప్రధానాంశాలు:

  • తెలుగు రాష్ట్రాల్లో గుండెపోట్లతో కలవరం
  • తాజాగా ఇద్దరు సీఐల ప్రాణాలు పోయాయి
  • ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Atmakur Ci Sudden Death
తెలుగు రాష్ట్రాల్లో గుండెపోట్లు కలవరపెడుతున్నాయి.. చూస్తుండగానే నిమిషాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఏపీలో ఇద్దరు సీఐలు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సీఐ మల్లి నాగేశ్వరరావు హార్ట్ ఎటాక్‌తో హఠాన్మరణం చెందారు. నాగేశ్వరరావు డీఎస్పీ కార్యాలయంలో సమావేశం ముగించుకొని ఇంటికి వెళ్లి భోజనం చేశారు.. కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సీఐ భార్య ఎస్సైకు సమాచారం ఇచ్చారు.
వెంటనే కానిస్టేబుల్‌ను పంపగా.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. సీఐ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు తేల్చారు. ఆత్మకూరు ఎస్పీ విజయరావు, ఆర్డీవో కరుణకుమారి, డీఎస్పీ, కమిషనర్‌, ఎస్సైలు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. సీఐ నాగేశ్వరరావు స్వగ్రామం బాపట్ల జిల్లా చీరాల కాగా.. భార్య, ఒక కుమారుడు ఉన్నారు. 2009లోనెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్‌ఐగా నాగేశ్వరరావు బదిలీపై వచ్చారు. అనంతరం తడ, నెల్లూరులోని సంతపేట పోలీ‌స్‌స్టేషన్లలో పనిచేశారు. ఐదు నెలల క్రితమే పదోన్నతిపై ఆత్మకూరు సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఇటు విశాఖలో కూడా సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.వెంకటశర్మ ప్రాణాలు కోల్పోయారు. ఉదయం ఆఫీస్ ఆవరణలో తోటి ఉద్యోగులతో కలిసి షటిల్ ఆడుతున్నారు.. శర్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. సి.ఐ.ఎస్‌.ఎఫ్‌.లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఆయన.. ఐదేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై సీబీఐకి వచ్చారు. శర్మ స్వస్థలం గుంటూరు జిల్లా తాడేపల్లి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.