యాప్నగరం

సీఎంను కలిసిన సింధు.. ప్రపంచ ఛాంపియన్‌‌కు జగన్ వరాలు!

ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించాక పీవీ సింధు తొలిసారి ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ఆమెపై ప్రశంసలు గుప్పించారు.

Samayam Telugu 13 Sep 2019, 1:44 pm
విజయవాడ: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సచివాలయంలో సీఎం ఆమెకు అభినందనలు తెలియజేశారు. తెలుగమ్మాయి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సాధించడం గర్వంగా ఉందని.. సింధుపై సీఎం ప్రశంసలు గుప్పించారు. వచ్చే ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఆమెకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారని పీవీ సింధు తెలిపారు. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా సీఎంను కలిశారు.
Samayam Telugu sindhu with cm jagan.


అనంతరం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం 3 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో పీవీ సింధును సత్కరించనున్నారు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించిన తర్వాత తొలిసారి ఏపీకి వచ్చిన సింధుకు.. గురువారం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, క్రీడాప్రాధికార సంస్థ (శాప్) అధికారులు సింధుకు స్వాగతం పలికారు.

Read Also: ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లపై జగన్ సర్కారు నిషేధం!

మరోవైపు బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌‌గా నిలిచిన సింధు పేరును పద్మభూషణ్‌ కోసం కేంద్రానికి క్రీడా శాఖ సిఫారసు చేసింది. పీవీ సింధుకి భారత మూడో అత్యున్నత పౌరపురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. 2017లోనూ సింధు పేరును క్రీడా శాఖ సిఫారసు చేసింది. కానీ అప్పుడు ఆమెకు పురస్కారం దక్కలేదు. ఈసారి మాత్రం సింధుకు పద్మభూషణ్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.