యాప్నగరం

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి షాకిచ్చిన జగన్ సెక్యూరిటీ

ముఖ్యమంత్రి జగన్ కర్నూలు పర్యటనలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి చేదు అనుభవం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్. సీఎం సెక్యూరిటీ సిబ్బంది పక్కకు తోసేయడంపై బైరెడ్డి ఆగ్రహం..

Samayam Telugu 19 Feb 2020, 7:51 pm
వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. కర్నూలు పర్యటన సందర్భంలో ఆయనకు సీఎం జగన్ సెక్యూరిటీ షాకిచ్చారు. సీఎం సభ ప్రాంగణం నుంచి జగన్ కాన్వాయ్ బయల్దేరింది. ఇదే సమయంలో బైరెడ్డి నడుచుకుంటూ అటువైపుగా వచ్చారు.. సీఎం కారుకు అడ్డుగా వెళ్లారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది ఒకరు సిద్ధార్థ్‌ను పక్కకు తోశారు.
Samayam Telugu byreddy.


సెక్యూరిటీ సిబ్బంది తీరుపై ఆగ్రహంతో బైరెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇంతలో అటుగా వచ్చిన కొందరు నేతలు, మిగిలిన సెక్యూరిటీ సిబ్బంది.. సిద్ధార్థ్‌కు సర్థిచెప్పారు. దీంతో ఆ వివాదం సద్ధుమణిగింది. సోమవారం ఈ ఘటన జరగ్గా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జగన్ సెక్యూరిటీ సిబ్బంది తీరుపై బైరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి తెలిసిందే.. అక్కడ కంటి వెలుగు, నాడు-నేడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.