యాప్నగరం

టీటీడీలో మరో వివాదం.. ఈసారి రామాయణంలో!

టీటీడీ మాసపత్రి సప్తగిరిలో రామాయణాన్ని మార్చేశారని ఆరోపణలు. సప్తగిరిలో రాసిన కథనంలో సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ కథ.

Samayam Telugu 2 Jun 2020, 1:27 pm
టీటీడీలో మరో వివాదం మొదలైంది. సప్తగిరి మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరించారని బీజేపీ నేతలు నిరసనకు చేపట్టారు. సప్తగిరిలో రాసిన కథనంలో సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ రాశారు. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడట. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు.
Samayam Telugu టీటీడీ


ఇటీవలే టీటీడీ భూముల వేలంపై రగడ జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత భూముల్ని అమ్మడం లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పాలకమండలి సమావేశంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం సద్దుమణిగిందని ఊపిరి పీల్చుకునేలోపు మళ్ల సప్తగిరి మాసపత్రిక విషయంలో వివాదం రేగింది. ఈ సప్తగిరి మాసపత్రిలో రాసిన కథపై మొదలైన వివాదంపై టీటీడీ స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.