యాప్నగరం

ఆ తప్పు మళ్లీ చేయొద్దు.. రాజధానిపై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..

వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత రాజధాని మార్చాలనుకోవడం సమంజసం కాదు. ఒకేచోట అభివృద్ధి చేయడం కూడా కరెక్ట్ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని బీజేపీ నేత దగ్గబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Samayam Telugu 30 Aug 2019, 4:21 pm

ప్రధానాంశాలు:

  • అభివృద్ధి అందరికీ చేరువ కావాలి
  • రాష్ట్రానికి కేంద్ర సహాయ సహకారాలు
  • నిధులు దారి మళ్లించిన టీడీపీ ప్రభుత్వం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Amaravati-2_2790
రాజధాని అమరావతి వివాదం కొనసాగుతోంది. రాజధాని తరలిపోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పష్టమై ప్రకటనేదీ చేయలేదు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో నిన్న జరిగిన సీఆర్డీఏ సమావేశం అనంతరం స్పష్టత వస్తుందని భావించినప్పటికీ ఎటూ తేల్చకుండానే సమావేశం ముగిసింది. సమావేశంలో అమరావతిపై చర్చ జరగలేదంటూ మంత్రి బొత్స వెల్లడించడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
Must Read :కోడెల వర్సెస్ రాయపాటి .. సత్తెనపల్లి టీడీపీలో రగడ..

తాజాగా అమరావతి వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి స్పందించారు. వేల కోట్లు ఖర్చు చేసిన తరువాత రాజధాని మారుస్తామనడం భావ్యం కాదన్నారు. రాజధాని నిర్మాణం ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని.. అయినా ఇష్టం వచ్చినట్లు మార్చడం కరెక్ట్ కాదన్నారు. హైదరాబాద్ విషయంలో తప్పు జరిగిందని, అభివృద్ధి అంతా ఒకేచోట జరిగిందన్నారు. ఆ తప్పు మళ్లీ పునరావృతం కారాదన్నారు. అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు అందాలని.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు.

Also Read :హద్దు దాటొద్దు ప్లీజ్.. ఏపీ డీజీపీ హెచ్చరికలు

రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని పురందేశ్వరి అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. ఏటా నియోజకవర్గానికి రూ.50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంపై శ్రద్ధ వహించాలని, నిధులు రాబట్టుకోవాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.