యాప్నగరం

Amaravatiపై జగన్ మౌనానికి గవర్నర్‌తో చెక్.. విశ్వభూషణ్‌ను కలిసిన సుజనా, కామినేని

అమరావతి విషయమై బీజేపీ నేతలు ఏపీ గవర్నర్‌ను కలిశారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. సీఎం ప్రకటన కోసం అమరావతి రైతులు ఎదురు చూస్తున్నారన్నారు.

Samayam Telugu 11 Sep 2019, 2:59 pm
ఏపీ రాజధాని అమరావతి విషయమై బీజేపీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, జమ్ముల శ్యామ్ కిశోర్ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులతో కలిసి గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ.. రాజధాని మార్పు వార్తలతో అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు.
Samayam Telugu governo with jagan


రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా.. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందించలేదని బీజేపీ నేతలు తెలిపారు. అందుకే ఈ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు.

అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఇక్కడ టీడీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అమరావతిలో సుజనా చౌదరి భూములు కొనుగోలు చేశారని బొత్స ఆరోపించారు. కాగా తనకు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా లేదని సుజనా చౌదరి చెప్పగా.. మీ సమీప బంధువు జితిన్ కుమార్ కంపెనీ పేరు మీద చందర్లపాడు మండలంలో 110 ఎకరాలు ఉన్న విషయం నిజం కాదా? అని బొత్స ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.