యాప్నగరం

చంద్రబాబు ఆ ప్రకటనతో ఆశ్చర్యం! బీజేపీ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

అప్పుడు చంద్రబాబు చేసినవే ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు. అందులో కొత్తగా ఏమీ లేదు. జగన్, చంద్రబాబుకి తేడా ఏమీ లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.

Samayam Telugu 10 Oct 2019, 6:29 pm
ప్రధాన ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. పాలకపక్షానికి దీటుగా ప్రతిపక్షం ఉండాలి.. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అబద్ధాల ప్రతిపక్షం ఉందని వీర్రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఇంకా జ్ఞ‌ానోదయం కలగలేదన్నారు. పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు ఆశ్చర్యకర ప్రకటనలు చేస్తున్నారని వీర్రాజు సెటైర్లు వేశారు.
Samayam Telugu Chandrababu-Naidu-770x433


చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి నుంచి వస్తుంటే రాళ్లతో దాడి చేయించారన్నారు. ఆయన ఇంటిపైకి గూండాలు, రౌడీలను పంపిచారని ఆరోపించారు. తన ఇంటిపైకి కొంతమంది బీసీ నాయకులను ఉసిగొల్పారని విమర్శించారు. రాష్ట్ర డీజీపీపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

Also Read: స్కూల్ బిల్డింగ్‌నీ వదలరా? జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి ఫైర్

అప్పుడు చంద్రబాబు చేసినవే ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారని, అందులో కొత్తగా ఏమీ లేదన్నారు. జగన్, చంద్రబాబుకి తేడా ఏమీ లేదన్నారు. ఆ విషయం చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అదే తీరులో ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగుతోందన్నారు. అధికార వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. 2024 బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలను గాడిలో పెడతామన్నారు.

రాజధాని అమరావతిపై చంద్రబాబు తీరును వీర్రాజు తప్పుబట్టారు. రాజధాని అంటూ విస్తృత ప్రచారం చేశారని, నిజానికి అంత అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని నిర్మించుకోవాలన్నారు. దేశంలో విడివడిన రాష్ట్రాలన్నీ కూడా రాజధానిని నిర్మించుకున్నాయని, అది సాధారణ ప్రక్రియగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైందని, రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.