యాప్నగరం

డిప్యూటీ సీఎంలే అలా.. ఇక ఈ పదవులా.! బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో నామినేటెడ్ పదవులపై బీజేపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ తన స్టైల్లో స్పందించారు. డిప్యూటీ సీఎంలతో పోలుస్తూ వైసీపీ నేతలకు ఛాలెంజ్ విసిరారు.

Samayam Telugu 18 Jul 2021, 8:26 pm
ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల పందేరంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెబుతూ కొన్ని వర్గాలకే కొమ్ముకాస్తోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నిన్న ప్రకటించిన నామినేటెడ్ చైర్మన్ పోస్టులే అందుకు నిదర్శనమన్నారు. కార్పొరేషన్ పదవుల పేరుతో జగన్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
gvl


ఉప ముఖ్యమంత్రులతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు జీవీఎల్. రాష్ట్రంలో ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారో.. వారికి కేటాయించిన శాఖలేంటో చెబితే పది వేల రూపాయలు ఇస్తానంటూ జీవీఎల్ సవాల్ విసిరారు. డిప్యూటీ సీఎంలకు కేటాయించిన శాఖలేంటో వారికే తెలియని పరిస్థితి ఉందని.. ఉప ముఖ్యమంత్రులకే వారికి ఏం అధికారాలు ఉన్నాయో కూడా తెలియదంటూ ఎంపీ ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంల పరిస్థితే అలా ఉంటే.. ఇక ఈ నామినేటెడ్ పదవుల సంగతేంటో వైసీపీ నేతలే చెప్పాలని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టులపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. నిధులు లేని కార్పొరేషన్లు.. కుర్చీలు లేని చైర్మన్ పదవులు ఎందుకంటూ టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి కీలక పోస్టులన్నీ తమ వర్గానికే ఇచ్చుకున్నారని.. ఎప్పుడూ వినని కార్పొరేషన్లకు చైర్మన్లు ఏంటంటూ ఎద్దేవా చేస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం పదవులు కేవలం అలంకారప్రాయం కాదని.. బాధ్యతగా పనిచేయాలని చెబుతుండడం విశేషం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.