యాప్నగరం

కేంద్రాన్ని సీఎం జగన్ ఫాలో కావాలి.. పెట్రోల్, డీజిల్ ధరలపై జీవీఎల్ కామెంట్స్

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సైతం వెంటనే పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 22 May 2022, 3:31 pm
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెంటనే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. అలాగే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆరు నెలల్లో రెండు సార్లు భారీగా తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించారని కొనియాడారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం మాదిరిగానే భారీగా వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎల్ నరసింహారావు ట్వీట్ చేశారు.
Samayam Telugu జీవీఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)



‘‘పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్‌ని ₹8/లీటర్ & డీజిల్ ₹6/లీటర్ తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీజీకి కృతజ్ఞతలు. దీని కారణంగా రిటైల్ ధరలు ₹9.5 /లీటర్ పెట్రోల్ & ₹7/లీటర్ డీజిల్ తగ్గుతాయి. ఆరు నెలల్లో రెండు సార్లు భారీగా తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించి నందుకు మోడీ గారికి ధన్యవాదాలు

వైసీపీ ప్రభుత్వం వ్యాట్‌ని విపరీతంగా పెంచడంతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలాగ భారీగా వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. లేదంటే బీజేపీ ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకువెళ్తుంది.’’ అని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.