యాప్నగరం

జైలు ఊచలు లెక్కపెట్టిన విజయసాయి.. బీజేపీ ఎంపీ సుజనా స్ట్రాంగ్ కౌంటర్

ఏ పౌరుడు అర్జీ పెట్టుకున్నా సంబంధిత శాఖకు పంపుతారు. జైలు ఊచలు లెక్కపెట్టిన విజయసాయి.. ఇకనైనా చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

Samayam Telugu 24 Dec 2019, 10:15 pm
వైసీపీ ఎంపీ విజయసాయిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. సుజనా ఆర్థిక నేరాలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ విజయసాయి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంటే సంబంధిత శాఖలకు పంపిస్తారని.. విజయసాయి ఫిర్యాదు కూడా అలాంటిదేనన్నారు. రాష్ట్రాపతి లేఖకు వచ్చిన ఎకనాలెడ్జ్‌మెంట్‌ను చూపించి తన ప్రతిష్టను దిగజార్చేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Samayam Telugu pjimage (36)


ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తూ తుది తీర్పు కోసం వేచిచూస్తున్న విజయసాయి తనపై ఆరోపణలు చేస్తున్నారని, జైలు ఊచలు లెక్కపెట్టిన విజయసాయి ఇకనైనా నేలబారు రాజకీయాలను కట్టిపెట్టాలని ఆయన హితవు పలికారు. తన వ్యాపారం.. రాజకీయ జీవితాలు తెరచిన పుస్తకాలేనని.. తనపై ఎక్కడా కేసులు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read: మూడు మిని సచివాలయాలు.. ఎంపీ టీజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

సుజనా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ విజయసాయి సెప్టెంబర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. విజయసాయి లేఖకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఫిర్యాదులను కేంద్ర హోం శాఖకు పంపిస్తున్నట్లు విజయసాయికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ ద్వారా సమాచారం అందించినట్లు సమాచారం.

ఎంపీ సుజనా చౌదరి అనేక రకాల ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు రాష్ట్రపతికి విజయసాయి ఫిర్యాదు చేశారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి సుజనా తప్పుడు మార్గాలు అనుసరించారని ఆరోపించారు. అందుకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు.. మరికొన్ని సాక్ష్యాధారాలను జత చేస్తూ విజయసాయి రాష్ట్రపతికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. సుజనాపై ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు.

Read Also:
సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌కు రెండు ప్రాణాలు బలి.. గుంటూరులో ఘోర ప్రమాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.