యాప్నగరం

ఎంపీ సుజనా చౌదరి ఇంట విషాదం

యలమంచిలి జనార్ధనరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. జనార్ధనరావు మరణంపై బీజేపీ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

Samayam Telugu 5 Dec 2020, 8:51 am
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇంట విషాదం. ఆయన తండ్రి యలమంచిలి జనార్ధనరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో శనివారం ఉదయం 11.45కు జరుగనున్నాయి. జనార్ధనరావు మరణంపై బీజేపీ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
Samayam Telugu సుజనా చౌదరి ఇంట విషాదం


యలమంచిలి జనార్ధనరావు కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించారు. కోయంబత్తూరులోని పిఎస్జీ కాలేజి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. అనంతరం 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి, శ్రీరామ్ సాగర్, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలో.. వాటిని అమర్చడంలోను కీలకపాత్ర వహించారు.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనార్ధనరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం తరపున ప్రత్యేక శిక్షణకు పలు యూరప్ దేశాలకు వెళ్లారు. ఉత్తమమైన సేవలందించినందుకు జనార్ధనరావుకు పలు అవార్డులు దక్కాయి. జనార్ధనరావుకి భార్య సుశీల, నలుగురు కుమారులు, ఒక కుమార్తె.. ఎంపీ సుజనా చౌదరి వారి చిన్నకుమారుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.