యాప్నగరం

సీమకు స్పెషల్ ప్యాకేజ్.. జగన్ సర్కార్‌కు బీజేపీ ఎంపీ అల్టిమేటం

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి జగన్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 7 Sep 2019, 4:36 pm
ఏపీకి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. గతంలో ఏపీ ప్రభుత్వం విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడపలో రాజధాని ఏర్పాటు చేయనుందని టీజీ చెప్పారు. ఇదే విషయమై సీఎం వైఎస్ జగన్ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో చర్చించారని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలే తనతో చెప్పారని టీజీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.
Samayam Telugu pjimage (37)


Also Read : వాలంటీర్లతో మతమార్పిడులు.. జగన్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు

కర్నూలులో జరిగిన ఓ సమావేశంలో టీజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కంటే వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక హాదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని డిమాండ్ చేశారు. కళ్ల ముందు నీళ్లున్నా తాగలేని దుస్థితి నెలకొని ఉందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ఇతర ప్రాంతాల వారికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులా మారిందన్నారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

ప్రత్యేక హోదా, ప్యాకేజీ లేకుంటే పరిశ్రమలు కూడా రావని టీజీ అన్నారు. రాయలసీమ ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ డిక్లరేషన్ ఇచ్చిందని, శాంతియుతంగా పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందని టీజీ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.