యాప్నగరం

AP Capital: మళ్లీ తరిమెయ్యరని గ్యారెంటీ ఏంటీ.. ఎంపీ టీజీ సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ టీజీ వెంకటేష్. కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన టీజీ. రాజధానికి ప్రతిసారీ అన్యాయం జరుగుతుందన్న వెంకటేష్.

Samayam Telugu 31 Dec 2019, 7:43 am
ఏపీలో మూడు రాజధానులపై గందరగోళం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పార్టీల వారీగా తమ వాదనల్ని వినిపిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు రాజధానుల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ప్రాంతంవారైనా సీమకు అన్యాయం చేస్తున్నారని.. నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Samayam Telugu venki


Read Also: ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో విషాదం

విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో లెజిస్లేచర్ కేపిటల్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని.. ఉత్తరాంధ్రకు ఎవరూ అడగకుండానే రాజధాని ఇస్తున్నారని.. భవిష్యత్‌లో ఆ రెండూ అభివృద్ధి అయ్యాక రాయలసీమ వాళ్లను తరిమేయరన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి అమరావతికి వెళ్లడమే కష్టమని భావిస్తుంటే.. ఇప్పుడు విశాఖలో రాజధాని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో సచివాలయం ఏర్పాటు చేయాలని.. లేదంటే మూడు చోట్లా అసెంబ్లీలు ఉండాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.

గతంలో కూడా రాజధాని విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని టీజీ వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని ఉండేది.. రాష్ట్ర విభజన జరిగాక అమరావతిలో రాజధాని పెట్టారని.. మళ్లీ ఇప్పుడు తీసుకెళ్లి విశాఖలో పెడుతున్నారని.. అన్ని ప్రాంతాలు కలసి ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి అయితే.. హైదరాబాద్ నుంచి తన్ని తరిమేసిన పరిస్థితి మళ్లీ వస్తుంది అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.