యాప్నగరం

'పారాసిటమాల్‌తో కరోనా మాయమని జగన్ చెప్పారు.. ఏపీ ప్రజల్ని మీరే కాపాడాలి'

కరోనా వైరస్ వస్తుంది, పోతుందని జగన్‌ అన్నారు.. వైరస్‌కు పారాసిటమాల్‌ వాడితే సరిపోతుందని అధికారిక హోదాలో ఉండి చెప్పారు. ఏపీ ప్రజలను కాపాడండి అంటూ కేంద్రమంత్రిని కోరిన సునీల్.

Samayam Telugu 17 Mar 2020, 7:21 am
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఇటు భారత్‌తో పాటూ తెలుగు రాష్ట్రాల్లోనూ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో పాజిటివ్ కేసులు నాలుగుకు చేరగా.. ఏపీలో నెల్లూరులో మాత్రమే ఒక కేసు నమోదైంది. ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. అధికారులు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
Samayam Telugu jagan


ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. కరోనా అంత ప్రమాదం లేదని.. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆయన్ను టార్గెట్ చేశాయి. బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రమాదకరమైన వైరస్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేడయం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలోనూ ఈ వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి.

తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ బాధత్యలు చూస్తున్న సునీల్ ధియోథర్ స్పందించారు. కరోనా వస్తుంది, పోతుందని జగన్‌ అన్నారని.. వైరస్‌కు పారాసిటమాల్‌ వాడితే సరిపోతుందని అధికారిక హోదాలో ఉండి చెప్పారని.. హర్షవర్ధన్ జీ దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి.. ఇలాంటి హాస్యాస్పదమైన సూచనల నుంచి ఏపీ ప్రజలను కాపాడండి అంటూ కేంద్రమంత్రిని ట్యాగ్ చేశారు. జగన్ పారాసిటమాల్‌పై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.