యాప్నగరం

ఉమా Vs దేవినేని.. బెజవాడ మార్క్ రాజకీయం!

ధర్నా, ర్యాలీతో హోరెత్తిన విజయవాడ.. పింఛన్ల విషయంలో పోటా-పోటీగా నిరసనలకు దిగిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్.

Samayam Telugu 10 Feb 2020, 3:11 pm
బోండా ఉమామహేశ్వరరావు వర్సెస్ దేవినేని అవినాష్.. టీడీపీ వర్సెస్ వైఎస్సార్‌సీపీ.. విజయవాడలో పొలిటికల్ హీట్ పెరిగింది. రెండు పార్టీల పోటా-పోటీ ధర్నాలతో హోరెత్తింది. జగన్ సర్కార్ ఏడు లక్షల మంది పింఛన్లు ఎత్తేసిందని టీడీపీ ఆరోపిస్తూ ధర్నాకు దిగితే.. ఇదంతా తప్పుడు ప్రచారమంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోటీగా ర్యాలీ చేశారు.
Samayam Telugu ysrcp tdp.


రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల పింఛన్లు తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడుతోంది. బొండా ఉమా కూడా విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలతో పాటూ పింఛన్లు తొలగించారని చెబుతున్న కొందరు బాధితుల్ని తీసుకొచ్చారు. పింఛన్‌పై ఆధారపడి బతుకున్నవారిని ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

ఇటు బొండా ఉమాకు కౌంటర్‌గా వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ కూడా భారీ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని.. ర్యాలీ తర్వాత ఓ సభ ఏర్పాటు చేశారు. పింఛన్లు తీసుకుంటున్న వారితో సభలో మాట్లాడించారు. ఈ ర్యాలీకి వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా తరలివచ్చారు. ఈ రెండు పార్టీల పోటా-పోటీ ధర్నాలతో విజయవాడ హోరెత్తింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.