యాప్నగరం

KCR: ఏపీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే.. మాకు సమాచారం ఉంది: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఎవరు అధికారంలో వస్తారనే దానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారమని తమకు సమాచారం ఉందని ఓ టీవీ ఛానెల్ డిబేట్లో కేసీఆర్ చెప్పారు. అయితే ఏపీలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తమకు ఒరిగేది లేదన్నారు కేసీఆర్. ఏపీ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పుడు మాట్లాడటం సబబు కాదంటూనే ఎవరు గెలుస్తారనే దానిపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

Authored byవంకం వెంకటరమణ | Samayam Telugu 23 Apr 2024, 10:43 pm
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల మీద తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్లో పాల్గొన్న కేసీఆర్ అనేక అంశాల మీద చర్చించారు. ఇందులో భాగంగానే ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో ఎవరు గెలుస్తారంటూ యాంకర్ ప్రశ్నించగా.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాట్లాడటం సరికాదని కేసీఆర్ తొలుత చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకు ఒరిగేదేమీ లేదని చెప్పుకొచ్చారు.
Samayam Telugu kcr
ఏపీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే.. మాకు సమాచారం ఉంది: కేసీఆర్


ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమకు పట్టింపులేదన్నారు కేసీఆర్. ఎవరి అదృష్టం బాగుంటే వారు గెలుస్తారని చెప్పారు. కానీ తమకు వచ్చిన సమాచారం మేరకు జగన్ గెలుస్తారని తెలుస్తోందని కేసీఆర్ అన్నారు. అయితే ఎవరు గెలిచినా తమకు బాధ లేదని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీ నేతగా ఓ పార్టీకి వత్తాసు పలకడం సరికాదన్న కేసీఆర్.. వాళ్ల రాష్ట్రం వాళ్ల రాజకీయాలు వారు చేసుకుంటున్నారని చెప్పారు, ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీపైనా స్పందించిన కేసీఆర్.. ప్రస్తుతానికి పోటీ చేయడం లేదన్నారు. భవిష్యత్తులో ఏపీలోనూ పోటీ చేస్తామన్నారు.

ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్‌కు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలోనూ కేసీఆర్.. వైఎస్ జగన్‌కు సహకరించారనే ప్రచారం ఉంది.అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ విభేధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్పందించను అంటూనే కేసీఆర్ ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో మరో 20 రోజుల్లో ఎన్నికల జరగనున్న సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.
రచయిత గురించి
వంకం వెంకటరమణ
వంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.