యాప్నగరం

చంద్రబాబు ఇంగ్లిష్‌పై బుగ్గన సెటైర్లు.. ప్లీజ్ ఆపేయండి సార్ అంటూ..

TDP ప్రభుత్వమే ప్రజలకు ఇంగ్లిష్ నేర్పించిందని బాబు అంటున్నారు. మరి 1995కి ముందు ఎవరికీ ఇంగ్లిష్ రాదా అని బుగ్గన ప్రశ్నించారు.

Samayam Telugu 21 Nov 2019, 7:22 pm
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇంగ్లిష్‌ ప్రావీణ్యంపై ఆర్థిక మంత్రి బుగ్గన సెటైర్లు వేశారు. తెలుగు దేశం ప్రభుత్వమే ఇంగ్లిష్ నేర్పించిందని బాబు అంటున్నారు. కానీ 1995కి మందు ఎవరికీ ఇంగ్లిష్ రాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల వాళ్లు విదేశాలకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు ఇంగ్లిష్‌లో మాట్లాడే విధానం గురించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘కెరీర్‌ను క్యారియర్ అంటున్నారు. ఫర్‌పెక్ట్ అంటున్నారు. ఎక్స్‌కవేటర్‌ను ప్రొక్లెయినర్ అంటున్నారు. ప్రొక్లెయిన్ అనేది ఓ బ్రాండ్. ఓ విలేకరి ఏదో అడిగితే. ఐయామ్ రియల్లీ అప్రిషియేట్ యూ అంటున్నారు. ఇది ఇంగ్లిషేనా?’’ అని బుగ్గన ప్రశ్నించారు.
Samayam Telugu buggana rajendranath reddy satires on chandrababu naidus english speaking skills
చంద్రబాబు ఇంగ్లిష్‌పై బుగ్గన సెటైర్లు.. ప్లీజ్ ఆపేయండి సార్ అంటూ..


బోండా ఉమ, బుద్ధా వెంకన్న, చింతమనేని ప్రభాకర్‌లకు చంద్రబాబు మంచి ఇంగ్లిష్ నేర్పొచ్చు కదా అని ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు తనకు తాను ఎకానమిస్ట్, విజనరీ అని, తాను క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకుంటున్నారు. వార్డు మెంబర్ లేదా సర్పంచ్ లాంటి వ్యక్తులు కూడా తన గురించి తాను చెప్పుకోరు. పక్కవాళ్లతో చెప్పిస్తారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ అన్న బుగ్గన.. దీనికి ఆయన ముగింపు పలకాలన్నారు.

విజన్ అనే మాటను ఎవరూ ఎవరికీ నేర్పించాల్సిన అవసరం లేదని బుగ్గన తెలిపారు. కన్సల్టెంట్లు ఏటా కొత్త కొత్త పదాలను నేర్పిస్తారన్న ఆయన.. వాటినే చంద్రబాబు మాట్లాడుతూ.. జార్జి బెర్నాడ్ షా తరహాలో మాట్లాడుతున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన బుగ్గన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘2014లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి కలెక్టర్ల సమావేశంలో.. చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీనే ముఖ్యం, పార్టీ కార్యకర్తలు చెప్పిన పనులే చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. కానీ జగన్ మాత్రం.. లా అండ్ ఆర్డర్ ముఖ్యమన్నారు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించడన్నారు బాబుకు, జగన్‌కు మధ్య పోలికేంటి’’ అని బుగ్గన వ్యాఖ్యానించారు.

Read Also: వైసీపీ రంగులేయడంపై మంత్రి అనూహ్య వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.