యాప్నగరం

శ్రీకాకుళం: వలస కూలీల బస్సు బోల్తా.. 30మందికి గాయాలు

మందస మండలం బాలిగాం వద్ద వలస కూలీలు వెళ్తున్న ట్రావెల్‌ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు.

Samayam Telugu 26 May 2020, 10:15 am
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం బాలిగాం వద్ద వలస కూలీలు వెళ్తున్న ట్రావెల్‌ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 30మందికిపైగా గాయాలయ్యాయి.. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వలస కూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులంతా పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.
Samayam Telugu బస్సు బోల్తా


బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ప్రయాణికులంతా వణికిపోయారు.. భయంతో హాహాకారాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని బయటకు తీశారు.. జాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ప్రమాదంలో అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు బోల్తాపడిందని స్థానికులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.