యాప్నగరం

వారి ఖాతాల్లో నగదు జమ.. మరో శుభవార్త చెప్పిన జగన్

Jagananna Thodu: చిరు వ్యాపారులకు తోడుగా నిలిచేందుకు జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే.. జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా.. చిరు వ్యాపారుల పెట్టుబడి కోసం వడ్డీలేని రుణాలు అందిస్తోంది. ఒక్కో వ్యాపారికి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణం ప్రభుత్వం ఇస్తోంది. బుధవారం నాడు జగనన్న తోడు పథకం కింద.. సీఎం జగన్ చిరు వ్యాపారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నగదును జమ చేయనున్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 11 Jan 2023, 10:28 am

ప్రధానాంశాలు:

  • చిరు వ్యాపారులకు శుభవార్త చెప్పిన జగన్
  • నేడు జగనన్న తోడు పథకం కింద నగదు జమ
  • ఒక్కో వ్యాపారికి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagananna Thodu
జగనన్న తోడు
Jagananna Thodu: ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులకు పెట్టుబడి కోసం.. జగనన్న తోడు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం నాడు చిరు వ్యాపారుల కోసం వడ్డీలేని రుణం రూ.395 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి.. నగదును జమ చేయనున్నారు. జగనన్న తోడు పథకంలో భాగంగా.. ఒక్కో వ్యాపారికి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణం అందిస్తోంది జగన్‌ (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం.
జగనన్న తోడు ద్వారా.. చిరు వ్యాపారుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తాజాగా ఇచ్చే రుణం జారీతో.. 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కూడా ప్రభుత్వం అందించనుంది. జగనన్న తోడు పథకం కింద ఇప్పటివరకు 15 లక్షల 31వేల 347 మందికి రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణాలు అందాయి. దీంతో చిరు వ్యాపారులకు వడ్డీల భారం తప్పుతోంది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.