యాప్నగరం

ఎంపీ విజయసాయికి డబుల్ షాక్.. సీబీఐ కోర్టు సీరియస్, హైకోర్టులోనూ!

ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు తెలపగా.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో విజయసాయి పిటిషన్‌ వేశారు. మొదట సీబీఐ లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని కోరారు.

Samayam Telugu 11 Aug 2021, 6:31 am
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. సీఎం జగన్‌ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు తెలపగా.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో విజయసాయి పిటిషన్‌ వేశారు. మొదట సీబీఐ లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు విజయసాయి వాదనను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
Samayam Telugu విజయసాయిరెడ్డి


సీబీఐ కేసులతో సంబంధం లేకుండానే ఈడీ కేసులపై విచారణ చేపట్టవచ్చని హైకోర్టు తేల్చిచెప్పింది. సీబీఐ కేసు తర్వాత గానీ, లేదంటే ఒకేసారి విచారణ చేపట్టవచ్చని, దీనిపై ఈ హైకోర్టుతో పాటు జార్జండ్‌, కేరళ, కర్ణాటక హైకోర్టులు స్పష్టత ఇచ్చాయన్న వాదనతో ఏకీభవించలేదు. పిటిషనర్లు తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న తీర్పులు సవరణకు ముందు వచ్చాయన్న వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టేశారు.

మరోవైపు జగన్ ఆస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. సీబీఐ కోర్టు విచారణ తాము ఇచ్చిన నోటీస్‌కు విజయసాయి స్పందించలేదని పిటిషనర్ తెలిపారు. కోర్టు ఆదేశాలిస్తేనే తాము నోటీస్ తీసుకుంటామని చెప్పారని పిటిషనర్ తరుపు న్యాయవాది అన్నారు. పిటిషనర్ ఇచ్చిన నోటీసుకు సీబీఐ స్పందించింది.. ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని విజయసాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.