యాప్నగరం

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. ఈ నెల 27న, చాలా కీలకం

వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు.

Samayam Telugu 7 May 2021, 1:09 pm

ప్రధానాంశాలు:

  • వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ
  • ఈ నెల 27న విచారణ జరపాలా వద్దా తేలనుంది
  • సీబీఐ కోర్టు నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ పిటిషన్ వేశారు.. దీనిపై కోర్టు విచారణ జరపగా.. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు కొనసాగాయి. జడ్జి ఈ నెల 27న పిటీషన్‌ను విచారణ జరపాలా లేదా అన్నదానిపై తీర్పును వెలువరించనున్నారు.. కోర్టు నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠరేపుతోంది.
అనంతపురం: పరిటాల శ్రీరామ్‌కు పోలీసుల షాక్
అనంతపురం: 15 రోజుల్లో పెళ్లి.. వధువుకు ఊహించని షాకిచ్చిన వరుడుముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ-1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు. రఘురామ జగన్‌పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషన్‌లో ప్రస్తావించారు. కోర్టు ఈ పిటిషన్‌ను విచారణ జరపాలా లేదా అన్న అంశంపై తీర్పును ఇవ్వనుంది.
విశాఖ: ఓ ఇంటి ముందు ఆకట్టుకుంటున్న ఫ్లెక్సీ.. ఆలోచించాల్సిన విషయమేసీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ అన్నారు. వైఎస్సార్‌సీపీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా తనపై ఉందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ చర్చనీయాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.