యాప్నగరం

జగన్ దగ్గర పనిచేయాలన్న ఆశలపై నీళ్లు.. ఏపీకి పంపేందుకు కేంద్రం నో..?

ఐపీఎఫ్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్ మీద పంపాలన్న జగన్ సర్కారు రిక్వెస్టు పట్ల కేంద్రం సుముఖత వ్యక్తం చేయలేదు.

Samayam Telugu 5 Sep 2019, 5:24 pm
తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. రవీంద్రను పంపడానికి తెలంగాణ సర్కారు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. కేంద్రం మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన డిప్యుటేషన్ ఆగిపోయింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఆరుగురు ఆలిండియా సర్వీస్ అధికారులను ఏపీకి డిప్యుటేషన్ మీద పంపాలని జగన్ సర్కారు కేంద్రాన్ని కోరింది. కాగా.. వీరి విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Samayam Telugu jagan rtc merge


వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శ్రీ లక్ష్మీ గనుల శాఖ కార్యదర్శిగా పని చేశారు. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లొచ్చారు. జగన్ ఎన్నికల్లో విజయం సాధించగానే ఆమె వెళ్లి ఆయన్ను కలిసొచ్చారు. ఏపీలో పని చేసేందుకు ఆమె ఆసక్తి చూపారు. ఆమెను డిప్యుటేషన్ మీద పంపడానికి కేసీఆర్ అంగీకరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రధాని మోదీ, అమిత్ షాలను శ్రీలక్ష్మీ కలిశారనే వార్తలొచ్చాయి. ఓ దశలో ఆమె డిప్యుటేషన్‌కు కేంద్రం ఓకే చెప్పిందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.

కర్ణాటక కేడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని కూడా డిప్యుటేషన్ మీద ఏపీ రప్పించాలని జగన్ భావించారు. కానీ ఆమెను కూడా ఏపీకి పంపడానికి కేంద్రం సుముఖంగా లేదని సమాచారం. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆలిండియా అధికారులను రాష్ట్రాల మధ్య డిప్యుటేషన్‌ మీద పంపడానికి అంగీకరిస్తామని.. ఇప్పుడు ఆ అవసరం లేదని కేంద్రం సమాధానంగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.